POCSO case | షరతులతో భగీరథ్‌కు ఊరట
POCSO case | షరతులతో భగీరథ్‌కు ఊరట
POCSO case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాలకు పైగా రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భగీరథ్‌పై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.
ఈ నేపథ్యంలో భగీరథ్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. శనివారం ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న మల్కాజ్‌గిరి కోర్టు, కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే కేసు విచారణ కొనసాగనుంది.
