సోదా శాలినికి ఘనంగా నివాళులు
సోదా శాలినికి ఘనంగా నివాళులు
- నివాళులర్పించిన ప్రముఖులు, నాయకులు
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల ప్రాంత ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు సోదా శాలినికి ఘనంగా నివాళులర్పించారు. పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ అన్న కొడుకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 53వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ సోదా కిరణ్ కుమార్ సతీమణి కీ,,శే,, శాలిని మాతృకర్మ శనివారం రోజున ఉదయం 11:30 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల ప్రాంత ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు శాలిని చిత్రపటానికి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు మాజీ కౌన్సిలర్ పోరండ్ల సంతోష్, జయంత్ లాల్, ఆంధ్రప్రభ విలేకరీ రావుల రాజు, బండి సదానందం గౌడ్, మార్క రఘుపతి గౌడ్, ఏకు రాజు, నల్లెల్ల అనిల్ కుమార్, తాళ్ల రవీందర్, మునిగంటి విష్ణువర్ధన్, బొచ్చు శ్రీధర్, మంద నరేష్, బొచ్చు జెమిని తదితరులు పాల్గొన్నారు.
