Allu Arjun Summons | విచారణకు హాజరు కావాలని…
Allu Arjun Summons | విచారణకు హాజరు కావాలని…
Allu Arjun Summons | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసును దర్యాప్తు చేస్తున్న చిక్కడపల్లి పోలీసులు, అల్లు అర్జున్‌ను A11 నిందితుడిగా చేర్చారు. థియేటర్ యాజమాన్యంతో పాటు మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సమాచారం.
ప్రీమియర్ షో సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్‌కు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్న కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణకు సంబంధించి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
