TG | సీసీఐ పత్తి కొనుగోళ్లలో కదిలిన అక్రమాల డొంక.!

  • టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాల ధ్రువీకరణలో అవకతవకలు…!
  • ఏడుగు మార్కెటింగ్ కార్యదర్శుల సస్పెన్షన్..!

  • ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారత కాటన్ కార్పొరేషన్ (సిసిఐ) ద్వారా రైతుల పేరిట పత్తి కొనుగోళ్లలో భారీ అక్రమాల గుట్టు బట్టబయలైంది. సిసిఐ కొనుగోళ్లలో గిట్టుబాటు ధర లభిస్తుందనే అత్యాశతో మార్కెటింగ్ అధికారులతో కుమ్మక్కై మధ్య దళారులు రైతుల పేరిట టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలతో పత్తి అమ్మకాలు సాగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది రైతులు, ఎన్ని ఎకరాల్లో పత్తి పంట సాగు అయిందనే వివరాలను వ్యవసాయ శాఖ ముందుగానే సేకరించి మార్కెటింగ్ శాఖకు నివేదించింది. ఈ మేరకు మార్కెటింగ్ అధికారులు యాప్ కూడా రూపొందించి రైతుల వివరాలు నమోదు చేశారు. సీసీఐ కేంద్రాల వద్ద రైతులు విక్రయించే పత్తి ముడి సరకు బదులు కొందరు రైతుల పేరిట దళారులు వ్యవసాయ శాఖ ధ్రువీకరణ పత్రం లేకుండా, ఆధార్ కార్డులు నమోదు చేయకుండా మార్కెటింగ్ అధికారులతో కుమ్మక్కై భారీ ఎత్తున పత్తి అమ్మకాలు జరిపినట్టు తెలిసింది. ఈ మేరకు సిసిఐ పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్టు విచారణలో తేలడంతో ఏడుగురు మార్కెటింగ్ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ రీజియన్ లోను పత్తి కొనుగోల్ల అక్రమాల బండారం బయటపడగా మరో ఏడుగురి పై వేటు పడినట్టు తెలిసింది.

  • సస్పెన్షన్ వేటుపడ్డ మార్కెటింగ్ అధికారులు వీరే..!
    సీసీఐ పత్తి కొనుగోళ్ల లో టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండానే రైతుల పేరిట భారీ ఎత్తున పత్తి కొనుగోల్లు జరిగినట్టు తేలింది. దిగుబడి కంటే రెట్టింపు స్థాయిలో కొనుగోలు జరగడం అక్రమాలకు ఆస్కారం ఏర్పడింది. దీంతో బాధ్యులైన వరంగల్ రీజియన్ పరిధిలోని మార్కెటింగ్ కార్యదర్శులు ఏడుగురిపై సస్పెన్షన్ వేటుపడింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మార్కెటింగ్ కార్యదర్శి కాంబ్లె మధుకర్ (అదిలాబాద్ ఇంచార్జ్ ), చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రామాంజనేయులు, జనగామ కార్యదర్శి సంగినేని శ్రీనివాస్, పెద్దపల్లి మార్కెట్ కార్యదర్శి పృథ్వీరాజ్, భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శి శ్రీనివాస్, చిన్నకోడూరు కార్యదర్శి పరమేశ్వర్ సస్పెన్షన్ వేటుకు గురైన వారిలో ఉన్నారు.

  • హైదరాబాద్ రీజియన్ లోనూ ఆవకతకవలు ..
    రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల అక్రమాలపై వారం రోజులపాటు బిజినెస్ అధికారుల బృందాలు విచారణ జరిపాయి. వరంగల్ రీజియన్ తో పాటు హైదరాబాద్ రీజియన్ లోను టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండా రైతుల పేరిట బురిడీ కొట్టించి మార్కెటింగ్ అధికారులతో చేతులు కలిపి పెద్ద ఎత్తున కొనుగోలు జరిగినట్టు తేలింది. ఈ మేరకు కొందరిపై సస్పెన్షన్ వెయిట్ వేసేందుకు మార్కెటింగ్ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *