తోట్ల ఎల్లమ్మ దేవతకు పూజలు నిర్వహించిన భక్తులు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లి తోట్ల ఎల్లమ్మ ఆలయంలో భక్తులు శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి పూజలు నిర్వహించడంతోపాటు కోడి బియ్యం ప్రసాదం సమర్పించారు. గత సంవత్సరంలో ఆలయ ధర్మకర్త జిగేల్ రత్నారెడ్డి నియోజకవర్గం లో ఆలయపున నిర్మాణం జరగగా అప్పటినుండి తోట్ల ఎల్లమ్మ దేవాలయానికి భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. తోట్ల ఎల్లమ్మ దేవాలయం కి వచ్చే ప్రధాన మార్గంలో మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి ప్రధాన ద్వారాన్ని నిర్మిస్తున్నారు.