80-kilometer | తెలంగాణ ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ సక్సెస్

80-kilometer | తెలంగాణ ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ సక్సెస్

  • 80 కిలోమీటర్ల ఛేజ్ తర్వాత గంజాయి వాహనం స్వాధీనం

80-kilometer | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: గంజాయి అక్రమ రవాణాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ప్రత్యేక నిఘా, దర్యాప్తు ఆధారంగా ఒడిశాలో చేపట్టిన చర్యల్లో ఏకంగా 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలో పట్టుబడిన గంజాయి ముఠాల లింక్‌ల ఆధారంగా ఈగల్ ఫోర్స్ బృందం ఒడిశాకు వెళ్లింది. అక్కడ బలిమెల నుంచి జయపూర్ వరకు దాదాపు 80 కిలోమీటర్ల మేర గంజాయి తరలిస్తున్న వాహనాన్ని వెంబడించి పట్టుకుంది.

80-kilometer

వాహనాన్ని తనిఖీ చేయగా వివిధ ప్యాకెట్లలో దాచిన 500 కిలోల గంజాయి బయటపడింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.