Bottle Deposit Refund | మందుబాబులకు బంపర్ ఆఫర్.. ఎక్కడంటే..
Bottle Deposit Refund | మందుబాబులకు బంపర్ ఆఫర్.. ఎక్కడంటే..
Bottle Deposit Refund |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: చెన్నైలో మద్యం బాటిళ్ల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు కొత్త వెండింగ్ మెషీన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మెషీన్ ద్వారా వినియోగదారులు ఖాళీ మద్యం బాటిళ్లను డిపాజిట్ చేసి, కొనుగోలు సమయంలో అదనంగా వసూలు చేసిన రూ.10 డిపాజిట్ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం కల్పిస్తున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో మద్యం బాటిల్ కొనుగోలు చేసే సమయంలో బాటిల్ డిపాజిట్‌గా అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఖాళీ బాటిళ్లను నేరుగా దుకాణానికి ఇచ్చి డబ్బులు తిరిగి పొందాల్సి ఉండేది. అయితే కొత్త వెండింగ్ మెషీన్‌తో ఈ ప్రక్రియ మరింత సులభంగా మారింది.
మెషీన్‌ను ఎలా ఉపయోగించాలనే విషయాన్ని ఓ వ్యక్తి వీడియో ద్వారా వివరించడంతో సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్‌గా మారింది. ముందుగా మెషీన్లో సూచించిన విధంగా బాటిల్‌ను డిపాజిట్ చేయాలి. అనంతరం బాటిల్‌ను గుర్తించి ధృవీకరించిన తర్వాత డిపాజిట్ మొత్తం తిరిగి డబ్బులు చెల్లిస్తారు.
.
ఇక ఇతర దుకాణాల్లో కొనుగోలు చేసిన బాటిళ్లను కూడా ఈ మెషీన్లో డిపాజిట్ చేయవచ్చా అనే సందేహం చాలా మందిలో నెలకొంది. దీనిపై కూడా వీడియోలో స్పష్టత ఇవ్వడంతో వినియోగదారుల్లో ఆసక్తి మరింత పెరిగింది. గుర్తింపు పొందిన TASMAC కేంద్రాల్లో కొనుగోలు చేసిన బాటిళ్లను నిర్దిష్ట నిబంధనల ప్రకారం మెషీన్లో డిపాజిట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పర్యావరణ పరిరక్షణతో పాటు గాజు బాటిళ్ల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంది.

