Bheemaram మహిళా సమాఖ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

Bheemaram మహిళా సమాఖ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ

భీమారం (Bheemaram), ఆంధ్రప్రభ: గత మూడున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా సమాఖ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

మహిళా సమాఖ్య అప్పులు, వడ్డీల లెక్కలు తేల్చకుండా అధికారులు మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని డివిజన్ కార్పొరేటర్ తౌటి రెడ్డి రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా యూత్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య సభ్యులు, నాయకురాళ్లతో రవీందర్ రెడ్డి ఇంట్లో సమావేశం నిర్వహించారు. మహిళా సమాఖ్య సభ్యుల సమస్యలను సావధానంగా విన్న విష్ణువర్ధన్ రెడ్డి, అతి త్వరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం మహిళా సమాఖ్య సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డికి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ శకుంతల, మహిళా సమాఖ్య గ్రూప్ లీడర్ గీత, లత, సులోచన, శ్రీవాణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.