Sangareddy వోక్సెన్‌లో ఘనంగా వార్షిక నాసా సదస్సు
Sangareddy వోక్సెన్‌లో ఘనంగా వార్షిక నాసా సదస్సు
సంగారెడ్డి (Sangareddy), ఆంధ్రప్రభ: దేశంలోనే అతిపెద్ద ఆర్కిటెక్చర్ విద్యార్థుల సమావేశాల్లో ఒకటైన 68వ వార్షిక నాసా సదస్సు–2026ను వోక్సెన్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్‌లో జూన్ 11 నుంచి 14 వరకు విజయవంతంగా నిర్వహించారు.
ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 4,500 మందికి పైగా ఆర్కిటెక్చర్ విద్యార్థులు, 500 మందికి పైగా ఆర్కిటెక్టులు, డిజైనర్లు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ ఆర్. కెవిన్ మార్క్ లో, విద్యావేత్త ఆర్. నూర్ కరీం, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ కీలకోపన్యాసాలు చేశారు. అలాగే గాయకుడు అమాల్ మాలిక్ ప్రత్యేక సంగీత ప్రదర్శన ఆకట్టుకుంది.
సదస్సులో 10 మాస్టర్‌క్లాస్‌లు, 20 సెమినార్లు, 60 వర్క్‌షాప్‌లు, నాసా ఇండియా రీసెర్చ్ కాన్ఫరెన్స్‌తో పాటు పలు జాతీయ స్థాయి డిజైన్ పోటీల తుది జ్యూరీలు నిర్వహించి యువ ఆర్కిటెక్టుల ప్రతిభకు వేదిక కల్పించారు.
