అనాథలైన చిన్నారులకు సీజీఆర్ అండ

అనాథలైన చిన్నారులకు సీజీఆర్ అండ
- దుర్గేష్ కుటుంబానికి తోడుగా నిలిచిన చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
- ఆడబిడ్డల పేరిట రూ.50 వేల డిపాజిట్
- తక్షణ నగదు సాయం.. కుటుంబానికి పరామర్శ
గుమ్మడిదల, ఆంధ్రప్రభ : ఇంటి పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి నిలిచారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని చాకలి దుర్గేష్ అకాల మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గోవర్ధన్ రెడ్డి గురువారం మృతుడి నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
దుర్గేష్ కుమార్తెలైన ప్రవళిక, లిఖితల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి పేరిట పోస్టాఫీసులో ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, మొత్తం రూ.50 వేల డిపాజిట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా తక్షణ అవసరాల కోసం నగదు సాయం అందజేశారు. భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్‌తో పాటు నాయకులు వెంకట్రాం రెడ్డి, రమేష్, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, భాస్కర్ తదితరులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
