ప్రభుత్వ పాఠశాల పునః ప్రారంభం..
జైపూర్, ఆంధ్రప్రభ : వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి జైపూర్ మండలంలోని రామారావుపేట ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పాఠశాలలోని యూపీఎస్ విద్యార్థులకు గ్రామ సర్పంచ్ పులి రాజశేఖర్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విద్య యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సంతోష్, పంచాయతీ కార్యదర్శి రజిత, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
