పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

సిరికొండలో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సిరికొండ, ఆంధ్రప్రభ: పెట్రోల్ ట్యాంకర్‌ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం సిరికొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ వైపు నుంచి కామారెడ్డి దిశగా వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ (టీఎస్ 16 యూబీ 0943)ను, గోడ్కోలు వైపు నుంచి సిరికొండకు వస్తున్న బైక్ (టీఎస్ 16 ఈఎన్ 3245) బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మండలంలోని తుంపల్లి గ్రామానికి చెందిన అయినాల అశోక్ (55), ఎనుగంటి సాయిలు (40) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించగా, క్షతగాత్రులను హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.

Leave a Reply