పరకాల మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం..
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపల్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పి. పవన్‌ను బీజేపీ పరకాల పట్టణ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
పరకాల మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధులు కమిషనర్ పి. పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పౌర సేవల మెరుగుదల వంటి అంశాలపై కమిషనర్‌తో బీజేపీ నాయకులు చర్చించారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్, పరకాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగా పురుషోత్తం, నాయకులు కుంటమల్ల గణేష్, ఆదిత్యతో పాటు పరకాల పట్టణ శాఖకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
