ToxicReleaseDate | టాక్సిక్.. పోస్ట్ పోన్ కి కారణం ఏంటి..?
ToxicReleaseDate | టాక్సిక్.. పోస్ట్ పోన్ కి కారణం ఏంటి..?
ToxicReleaseDate | ‘టాక్సిక్’పై భారీ అంచనాలు ఎందుకు?
టీజర్‌తో రచ్చ.. సోషల్ మీడియాలో వైరల్
వరుస వాయిదాలతో అభిమానుల్లో నిరాశ
2027 సంక్రాంతి బరిలోకి ‘టాక్సిక్’?
సంక్రాంతి రిలీజ్ సరైన నిర్ణయమేనా?
ToxicReleaseDate | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేజీఎఫ్ హీరో యశ్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ డైరెక్టర్. ఈ సినిమా మార్చిలో రావాలి కానీ… ఇంత వరుకు రాలేదు. ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ లేదు. తాజాగా టాక్సిక్ రిలీజ్ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీంతో సినీ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ.. ప్రచారంలోకి వచ్చిన ఆ వార్త ఏంటి..? టాక్సిక్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?
ToxicReleaseDate | అది పెద్ద రచ్చ.. చర్చ..

యశ్ కేజీఎఫ్ తర్వాత చేసిన సినిమా కావడం.. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. టాక్సిక్ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. పైగా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ లో గ్లామర్ డోస్ ఎక్కువుగా చూపించడంతో పెద్ద రచ్చే జరిగింది.. దీని గురించి పెద్ద చర్చే జరిగింది. దీంతో యూత్ ఎప్పుడెప్పుడు టాక్సిక్ విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటే.. ఈ మూవీ మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ ప్రకటించకుండా సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు.
ToxicReleaseDate | టాక్సిక్ మళ్లీ వాయిదా..?

ఈ భారీ చిత్రాన్ని అసలు మార్చి 19న విడుదల చేయాలి అనుకున్నారు. ఆతర్వాత జూన్ 4కు వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆతర్వాత జూన్ 4న కూడా టాక్సిక్ రావడం లేదని.. న్యూ రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇంత వరుకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ మూవీ పై ఎన్నో ఆశలతో ఉన్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఆమద్య యశ్ అయితే.. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసాడు. ఇక విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది అనుకుంటే.. ఊహించని విధంగా బ్రేక్ పడింది.
ToxicReleaseDate | సంక్రాంతి బరిలో టాక్సిక్..?

ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాక్సిక్ రిలీజ్ డేట్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమాని ఈ ఇయర్లోనే రిలీజ్ చేయాలి అనుకోవడం లేదట. 2027 సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నారట. కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ఇయర్ లో ఇంకా ఆరు నెలలు టైమ్ ఉంది. అయినా రిలీజ్ చేయకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. సినిమాకి నష్టమే అంటున్నారు సినీ పండితులు. కారణం ఏంటంటే.. సంక్రాంతికి భారీ సినిమాలు వస్తాయి. పైగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఓ అరడజను సినిమాలు వస్తాయి. దీని వలన ఎక్కువ థియేటర్లు దొరికే ఛాన్స్ ఉండదు. అందువలనే టాక్సిక్ సంక్రాంతికి రిలీజ్ చేయడం సరైన నిర్ణయం కాదంటున్నారు. మరి.. ఏం జరగనుందో చూడాలి.
