indrakeeladri15thjune | వేసవి సెలవుల చివరి ఆదివారం.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
indrakeeladri15thjune | వేసవి సెలవుల చివరి ఆదివారం.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
indrakeeladri15thjune | కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం
తెల్లవారుజాము నుంచే కిటకిటలాడిన క్యూలైన్లు
భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు
62,967 మంది అమ్మవారి దర్శనం
10,208 మంది అన్నదాన ప్రసాదం స్వీకరణ
indrakeeladri15thjune | ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కనకదుర్గమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల చివరి ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దీంతో కొండ మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది.
తెల్లవారుజాము నుంచే దర్శన క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తులకు సాఫీగా దర్శనం కల్పించారు.

ఆదివారం వివరాలు ఇలా..
దేవస్థానం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆదివారం మొత్తం 12,848 దర్శన టికెట్లు విక్రయించగా, 62,967 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 1,25,088 యూనిట్ల ప్రసాదం విక్రయమైంది. హుండీ, విరాళాల రూపంలో రూ.3,12,686 ఆదాయం లభించింది. వివిధ సేవల్లో 776 మంది భక్తులు పాల్గొనగా, 2,784 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే దేవస్థానం నిర్వహించిన ఉచిత అన్నదాన కార్యక్రమంలో 10,208 మంది భక్తులు భోజనం స్వీకరించారు.

భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ దేవస్థానం చేపట్టిన సమర్థవంతమైన ఏర్పాట్లతో దర్శనాలు సజావుగా కొనసాగాయని అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

CLICK HERE TO READ indrakeeladri13thjune | ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం..
