గంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత

జైపూర్ ,ఆంధ్రప్రభ : జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు వద్ద షేక్ ఆఫ్రీద్ అనే యువకుడి నుంచి 145 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఇందారం క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. తనిఖీలను గమనించి అక్కడి నుండి ఓ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని బ్యాగ్ లో తనిఖీ చేయగా ఒక ప్యాకెట్‌లో గంజాయి లభించడం జరిగిందని పేర్కొన్నారు.

నిందితుడు తక్కువ సమయంలో ఎక్కువ డబ్భు సంపాదించాలనే ఆలోచనతో మహారాష్ట్ర చంద్రపూర్ నుండి గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుండి గంజాయి కొనుగోలు చేసి జైపూర్ పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకురావడం జరిగిందని నిందితుడు ఒప్పుకోవడం జరిగిందని పోలీసులు వెల్లడించారు. నిందితున్ని వద్ద నుండి ఒక ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై భూమేష్, సిబ్బందిని ఏసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు.