సెంట్రల్ టీడీపీ మహిళ అధ్యక్షురాలుగా పైడి తులసి నియామకం

సెంట్రల్ టీడీపీ మహిళ అధ్యక్షురాలుగా పైడి తులసి నియామకం

పాయకాపురం, ఆంధ్రప్రభ : తెలుగు మహిళ సెంట్రల్ నియోజకవర్గ నూతన అధ్యక్షురాలిగా పైడి తులసి నియామకం అయ్యారు. ఈ సందర్భంగా అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని సెంట్రల్ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పైడి తులసిని సెంట్రల్ టీడీపీ అధ్యక్షురాలిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు.

మహిళల అభ్యున్నతికి టీడీపీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వీరమాచినేని లలిత, ఎరుబోతు శ్రావణి మోదుగుల తిరుపతమ్మ, జిల్లా పార్లమెంట్  కార్యదర్శి ఎస్. కె గౌసియా,ఇంచార్జి పైడి శ్రీను, ఏ. గోపిరెడ్డి, దాసరి కనకారావు, మరియా,రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.