వైఎస్సార్సీపీ నిరసనలకు ప్రజల విశేష స్పందన..

వైఎస్సార్సీపీ నిరసనలకు ప్రజల విశేష స్పందన..

: మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి లభించిన విశేష స్పందన ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిందని, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు స్పష్టమైన నిదర్శనమని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం కావడంలో కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో భారీగా పాల్గొని విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు, ప్రతి ఒక్కరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.