వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. కుండపోతగా వర్షం కురడంతో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయం కాగా ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో అత్యధికంగా పూడూరు మండలంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వికారాబాద్లో ఆరు సెంటిమీటర్లు, నవాబుపేటలో 6 సెంటీమీటర్లు, చోడపూర్ లో 5.9 సెంటీమీటర్లు, పూడూరులో 5.7 సెంటీమీటర్లు, మోవిన్పేట్లో ఐదు పాయింట్స్ నాలుగు సెంటీమీటర్లు, పరిగిలో 4.6 సెంటీమీటర్లు, 3.5 సెంటీమీటర్లు, దుద్యాలలో 3.1 సెంటీమీటర్, దోమలు 3.1cm, పరిగిలో మూడు సెంటీమీటర్లు, కుల్కచర్లలో 2.7 సెంటీమీటర్లు, దౌల్తాబాద్ లో 1. 8 సెంటీమీటర్లు, కోటిపల్లిలో ఒక సెంటీమీటర్లు, 1.5 సెంటీమీటర్లు తాండూరులో, ఒక సెంటీమీటర్ బంటారం దారుర్ కొడంగల్లో నామాత్రంగా వర్షం కురిసింది.