మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలు.

మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలు.

రూ 6 లక్షల 51 వేల విలువైన ఎల్ ఓ సీ లు అందజేత..

భవానిపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను శనివారం కూటమినేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బాధితుల కుటుంబాలకు అందజేశారు. 39వ డివిజన్ కామకోటి నగర్ కు చెందిన కే వెంకట అన్నపూర్ణ (55) దీర్ఘకాలిక నరాల వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 2 లక్షల ఎల్ ఓ సీ ను ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్ తో కలిసి అందజేశారు. అదేవిధంగా 52 వ డివిజన్ , కొత్తపేటకు చెందిన సీ రమాదేవి (42) హృద్రోగం, అధిక రక్తపోటుతో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4 లక్షల 51 వేల విలువైన ఎల్ ఓ సీ ను మాజీ కార్పొరేటర్ అలుగుండ్ల సుబ్బారెడ్డి తో కలిసి బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. బీసీ సంఘం నేత కలిశెట్టి లక్ష్మణరావు, మారెళ్ళ రామకృష్ణ, సుజనా మిత్రా కోఆర్డినేటర్ దొడ్ల రాజా పాల్గొన్నారు.