పొన్కల్ లో అంతర్జాతీయ యోగ దినోత్సవం…
మామడ, ఆంధ్రప్రభ : మండలంలోని పొన్కల్ గ్రామంలో అంతర్జాతీయ 11వ యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపాధిహామీ పని ప్రదేశంలో సీనియర్ సిటిజన్, మహిళలకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో పొన్కల్ హోమియో వైద్యురాలు డాక్టర్ ఎం. సంతోషి, ఫార్మసిస్ట్ నర్సారెడ్డి, యోగ శిక్షకులు యుగంధర్, మౌనిక, సిబ్బంది నర్సవ్వ, గ్రామస్తులు ఉన్నారు.
