DONATION | శ్రీవారి సన్నిధిలో తాళాల అప్పగింత
DONATION | శ్రీవారి సన్నిధిలో తాళాల అప్పగింత
DONATION | టీటీడీకి ట్రక్కు విరాళం
రూ.31.72 లక్షల విలువైన వాహనాన్ని అందజేసిన అశోక్ లేలాండ్
ప్రత్యేక పూజల అనంతరం టీటీడీ అదనపు ఈవోకు తాళాల అందజేత
DONATION | తిరుమల, ఆంధ్రప్రభ : ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ శనివారం తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.31.72 లక్షల విలువైన ట్రక్కును విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అశోక్ లేలాండ్ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ ట్రక్కు తాళాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ సేవా కార్యక్రమాలు, రవాణా అవసరాలకు ఈ వాహనం ఉపయోగపడనుంది. సంస్థ తరఫున అందించిన ఈ విరాళానికి టీటీడీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జి జనరల్ మేనేజర్ లక్ష్మీ ప్రసన్న, తిరుమల డీఐ కృష్ణయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

