Varanasi | వారణాసి రెండు పార్టులా..? ఒక పార్టేనా..? రాజమౌళి క్లారిటీ

Varanasi | వారణాసి రెండు పార్టులా..? ఒక పార్టేనా..? రాజమౌళి క్లారిటీ
- మహేష్ బాబు – రాజమౌళి కాంబోపై భారీ అంచనాలు
- వారణాసి రెండు పార్టులంటూ వచ్చిన ప్రచారం
- అంతర్జాతీయ మీడియాకు జక్కన్న వివరణ
- వారణాసి రన్‌టైమ్ ఎంత ఉండనుంది..?
- 2027 రిలీజ్‌పై ఫుల్ డీటెయిల్స్
Varanasi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ మూవీ (Movie) టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలకు మించిన క్రేజ్ వచ్చింది. ఈ మూవీ కోసం డిఫరెంట్ స్ట్రాటజీతో వర్క్ చేస్తున్నారు జక్కన్న. సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు.. అప్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. అయితే.. వారణాసి ఒక పార్ట్ కాదు.. రెండు పార్టులు అని ప్రచారం జరుగుతుంది. ప్రచారంలో ఉన్న వార్తల పై జక్కన్న క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ.. రాజమౌళి ఏం చెప్పారు..? వారణాసి ఒక పార్టా..? రెండు పార్టులా..?

ఈ భారీ, క్రేజీ మూవీలో మహేష్ బాబు రుద్రగా కనిపిస్తుంటే.. ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించనుంది. ఇక మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ.. ఇందులో మహేష్ బాబు తండ్రి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈమధ్య ప్రకాష్ రాజ్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నట్టుగా సోషల్ మీడియా (Media) ద్వారా తెలియచేశారు. దాదాపుగా 1300 కోట్ల భారీ బడ్జెట్ తో.. ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకగా నిర్మిస్తున్నారు. గ్లోబల్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ భారీ, క్రేజీ మూవీని 2027లో ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. రాజమౌళి.. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఓ కీలక విషయాన్ని బయటపెట్టారు. వారణాసిని (Varanasi) ముందుగా రెండు పార్టులుగా తీయాలి అనుకున్నామని.. అయితే.. షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే రెండు పార్టులుగా తీయాలనే నిర్ణయాన్ని మార్చుకున్నాం అన్నారు. వారణాసి చిత్రాన్ని ఇప్పుడు ఒక పార్ట్ గానే తీస్తున్నామని.. రన్ టైమ్ 3 గంటలకు పైగా ఉండచ్చని చెప్పారు. దీంతో వారణాసి రెండు పార్టులు అంటూ జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. ఈ భారీ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ, షోయింగ్ బిజినెస్ బ్యానర్ పై ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.

CLICK HERE TO READ ఇంట్రెస్టింగ్.. కమల్ స్క్రీన్ టైమ్ షాక్ ..?
