సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న కేరళ డీజీపీ
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న కేరళ డీజీపీ
మోపిదేవి, ఆంధ్రప్రభ: మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కేరళ రాష్ట్ర డీజీపీ రవడ చంద్రశేఖర్ మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చక బృందం ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ కుటుంబ సభ్యులతో కలిసి నాగపుట్టలో పాలు పోసి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అనంతరం శేషవస్త్రాలతో సత్కరించారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను డీజీపీకి అందజేశారు.
