నారా లోకేష్‌కు ఘన స్వాగతం

నారా లోకేష్‌కు ఘన స్వాగతం

పుట్టపర్తి టౌన్, ఆంధ్రప్రభ : సత్యసాయి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికినట్లు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నారా లోకేష్ కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply