India vs Afghanistan Test | ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్

India vs Afghanistan Test | ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్

India vs Afghanistan Test | టాస్ గెలిచిన టీమిండియా
ఓపెన‌ర్లుగా జైశ్వాల్‌, కేఎల్‌రాహుల్‌
24 ప‌రుగుల‌కు జైశ్వాల్ ఔట్‌
భార‌త ఆట‌గాడు మానవ్ సుతార్ టెస్ట్ అరంగేట్రం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ జట్టు టీమిండియాతో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఉన్న మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భార‌త ఆట‌గాళ్లు జైస్వాల్‌, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ దిగారు. మ‌హ్మ‌ద్ స‌లీమ్ బౌలింగ్‌లో జైస్వాల్ 24 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో కేఎల్ రాహుల్‌, సాయి సుద‌ర్శ‌న్ ఉన్నారు. వీరిద్ద‌రు నిల‌క‌డ‌గా బ్యాటింగ్ చేస్తున్నారు. 20 ఓవ‌ర్ల‌కు భార‌త్ 80 పరుగులు చేసి ఒక వికెట్‌ను న‌ష్ట‌పోయింది.

టాస్ అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ, “మేం ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ వాతావరణం వేడిగా, తేమతో కూడుకుని ఉంది. మ్యాచ్ సాగేకొద్దీ పిచ్ నెమ్మదించే అవకాశం కనిపిస్తోంది. నేను ఈ ప్రాంతంలోనే క్రికెట్ ఆడుతూ పెరిగాను. ఇక్కడ భారత జట్టుకు నాయకత్వం వహించడం గర్వకారణం. మా సన్నద్ధత సంతృప్తికరంగా జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత స్వదేశంలో వరుసగా తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉంది. అందుకే సరైన జట్టు కూర్పును సిద్ధం చేసుకోవడం కీలకం. ఈ మ్యాచ్ ద్వారా మానవ్ సుతార్ టెస్ట్ అరంగేట్రం చేస్తున్నాడు” అని తెలిపాడు.

ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ మాట్లాడుతూ, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, తాము టాస్ గెలిచినా బ్యాటింగ్‌కే మొగ్గు చూపేవాళ్లమని పేర్కొన్నాడు. “సవాళ్లను స్వీకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ మ్యాచ్ కోసం కాబూల్‌లో ప్రత్యేక శిక్షణా శిబిరంలో పాల్గొన్నాం. మా ప్రధాన కోచ్ రిచర్డ్ పైబస్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో జట్టును ముందుకు నడిపిస్తారు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం. మా జట్టులో నంగేయాలియా ఖరోటే ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేస్తున్నాడు” అని చెప్పాడు.

తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

ఆఫ్ఘ‌నిస్థాన్: సెదిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అఫ్సర్ జజాయ్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహ్మాన్, మహమ్మద్ సలీమ్.

CLICK HERE TO READ IND vs AFG Only Test | రెడ్ బాల్ ఛాలెంజ్‌కు భారత్ రెడీ..

CLICK HERE TO READ MORE

Leave a Reply