ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధన..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ప్రాథమిక పాఠశాల ఉన్నంత స్థాయి సమావేశం గ్రామ సర్పంచ్ ఎంఏ.సమీర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ ఎడ్ల శేఖర్ మాట్లాడుతూ, నూతన సంవత్సరం నుండి తల్లిదండ్రులు విద్యార్థి సుమాకర అభివృద్ధికి పాటుపడుతున్న మన ఊరి పదవి ఉన్నంత పాఠశాలలో మీ పిల్లలను ఉజ్జల భవిష్యత్తు తీర్చిదిదెందుకు ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు.
పాఠశాల ప్రత్యేకత ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, ఇంగ్లీష్ భాషాభివృద్ధికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, ఎఫ్ ఎల్ ఎన్ ఆధారిత బోధన,ఉచిత పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, రెండు జతల స్కూల్ యూనిఫామ్ ఉచితంగా ఇవ్వడం ప్రతిరోజు ఉదయం అల్పాహారం ఇవ్వడం, హోమ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్, జనరల్ నాలెడ్జ్ పై ప్రత్యేక శ్రద్ధ,కంప్యూటర్, ప్రొజెక్టర్ ద్వారా భోధన, క్విజ్, ఉపన్యాసం వ్యాసరచన, సాంస్కృతిక, సాంప్రదాయ కార్యక్రమాలు మీ పిల్లల ఆరోగ్యం కొరకు ఆటలు, యోగలో శిక్షణ వారానికి 3 సార్లు గుడ్లు,రాగి జావ, సన్నబియ్యంచే మధ్యాహ్న భోజనం విజ్ఞాన విహారయాత్రలు తీసుకెళ్ళటం, సైన్స్ ఫేర్ నిర్వహణ ప్రతీ నెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహణ విద్యార్థుల వ్యక్తిగత పర్యవేక్షణ, సమాజం పట్ల భాధ్యత నేర్పడం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందించడమే ప్రభుత్వ పాఠశాల లక్ష్యమని హెడ్మాస్టర్ ఎడ్ల శేఖర్, ఉపాధ్యాయులు అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంద గోవర్ధన్ పాలకవర్గం సభ్యులు, మైనార్టీ సభ్యులు,పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
