కంటి చూపుకు రక్షణ కవచం ‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి’

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదనే ఉదాత్త లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీకారం చుట్టిన ఉచిత కంటి వైద్య శిబిరాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. తన మాతృమూర్తి ‘కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్’ పేరు మీద ఆయన ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ పెద్దకొడుకుగా మారి ఆయన కంటి శస్త్రచికిత్సలు చేయిస్తుండటం విశేషం. ​

రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఎవరికీ కంటి చూపు సమస్యలు ఉండకూడదనే ప్రణాళికతో ఏకంగా 10,000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 13 విడతలుగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, మొత్తం 9,766 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 4,227 మందికి ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేయగా, 2,198 మందికి అత్యంత విజయవంతంగా కంటి ఆపరేషన్లు పూర్తి చేయించారు.

విడతల వారీగా జరిగిన కంటి ఆపరేషన్ల వివరాలు:

1వ విడత (మునుగోడు మండలం): 216 మందికి
​2వ విడత (మునుగోడు మండలం): 108 మందికి
​3వ విడత (చండూరు మున్సిపాలిటీ): మునుగోడులో జరిగిన శిబిరంలో 129 మందికి
​4వ విడత (నాంపల్లి మండలం): నాంపల్లి కేంద్రంలో 229 మందికి
​5వ విడత (మర్రిగూడ మండలం): మర్రిగూడ కేంద్రంలో 171 మందికి
​6వ విడత (చండూరు మండలం): బంగారిగడ్డలో 198 మందికి
​7వ విడత (ఘట్టుప్పల్ మండలం): ఘట్టుప్పల్ కేంద్రంలో 65 మందికి
​8వ విడత (నారాయణ్‌పూర్ మండలం): నారాయణ్‌పూర్‌లో 132 మందికి
​9వ విడత (చౌటుప్పల్ మున్సిపాలిటీ): చౌటుప్పల్‌లో 82 మందికి
​10వ విడత (చౌటుప్పల్ మండలం): చౌటుప్పల్‌లో 160 మందికి
​11వ విడత (మునుగోడు, ఘట్టుప్పల్ మండలాలు): మునుగోడులో 257 మందికి
​12వ విడత (చండూరు మున్సిపాలిటీ, మండలం): మునుగోడు క్యాంపు కార్యాలయంలో 223 మందికి
​13వ విడత (నాంపల్లి మండలం): మునుగోడు క్యాంపు కార్యాలయంలో 228 మందికి విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తి చేశారు.

​రేపు మర్రిగూడెంలో 14వ శిబిరం : ఈ మహా యజ్ఞంలో భాగంగా రేపు (ఆదివారం, 07-06-2026) మర్రిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ శిబిరం జరగనుంది.

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరగబోయే ఈ శిబిరానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మర్రిగూడెం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇప్పటికే గ్రామాల్లో టామ్ టామ్ (దండోరా) వేయించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

Leave a Reply