India vs Afghanistan Test | కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ అర్ధ సెంచరీలు

India vs Afghanistan Test | కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ అర్ధ సెంచరీలు

India vs Afghanistan Test | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటర్లు కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. తొలి రోజు ఆటలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసి భారత్‌కు బలమైన పునాది వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు యశస్వి జైస్వాల్ 24 పరుగులు చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్, ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.

మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఇద్దరూ వ్యక్తిగత అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. కేఎల్ రాహుల్ 64 పరుగులు, సాయి సుదర్శన్ 63 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు

Leave a Reply