పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

  • ప్రధానోపాధ్యాయులు నక్క బాబురావు

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని స్వామి పుల్లయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నక్క బాబురావు పేర్కొన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు, మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో పాఠశాలలో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నక్క బాబురావు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి సామాజిక బాధ్యత అని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడంలో, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడంలో, వర్షపాతం సమృద్ధిగా కురవడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు లేదా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు వేగినాటి వెంకటరమణ, సీఆర్‌పీ జొన్నలగడ్డ చిన్న గోపాలరావు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.