రంగరాజును అభినందించిన కౌన్సిలర్ మల్లికార్జున గౌడ్
వికారాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు కాకి రంగరాజ్ను 31వ వార్డు కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కింది స్థాయి నుంచి ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకున్న రంగరాజ్ మరింతగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
