కుంటాలలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు

కుంటాలలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు

ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

కుంటాల, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కుంటాల మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆడే కమల్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అల్లాడి వనజ, వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారి విక్రమ్ జెండా ఎగురవేశారు.

సొసైటీ కార్యాలయంలో చైర్మన్ సట్ల గజ్జరం, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం లక్ష్మణ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యాలయంలో ఏపీఓ నవీన్, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సి. అశోక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాధికారి ముత్యం, గ్రంథాలయంలో రాజు, పశువైద్య కార్యాలయంలో డాక్టర్ ప్రియాంక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శృతి రెడ్డి జెండా ఎగురవేశారు.

గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జక్కుల గజేందర్, తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏఈ మధు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే మండలంలోని వివిధ కార్యాలయాల అధికారులు, గ్రామపంచాయతీల సర్పంచ్‌లు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలుచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు.

Leave a Reply