పశ్చిమ నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ నూతన కార్యవర్గం ప్రకటన

  • యువత,విద్యార్థుల సమస్యల పరిష్కారమే టీఎన్ఎస్ఎఫ్ ముఖ్య ఉద్దేశం
  • టి ఎన్ ఎస్ ఎఫ్ పశ్చిమ నియోజకవర్గం నూతన సభ్యులకు ఎంపీ చిన్ని అభినందనలు

ఆంధ్రప్రభ, భవానిపురం : విద్యార్థులకు, యువతకు అధిష్ఠానికి మధ్య వారధే టిఎన్ఎస్ఏఎఫ్ అని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్(చిన్ని) పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ నూతన కార్యవర్గ కమిటీ మంగళవారం మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల యువత సమస్యలపై టీఎన్ఎస్ఎఫ్ ఎప్పుడు పరిష్కార మార్గాలను చూపేలా సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో టి ఎన్ ఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ పశ్చిమ నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మోది వెంకటరాజు, కార్యదర్శిరౌతుల మణికంఠ ఎంపిక కాబడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply