ACB | మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్ట్‌

ACB | మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్ట్‌

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావును (Bhujanga Rao) ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల ఆయనకు చెందిన 16 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

భుజంగరావుకు సూర్యాపేట జిల్లాలో 27 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి, ఐదు ఇంటి స్థలాలు, రెండు నివాస గృహాలు, హైదరాబాద్‌లో ఒక కమర్షియల్ భవనం ఉన్నట్లు ఏసీబీ సోదాల్లో తేలింది. అలాగే కిలో బంగారు నగలు, 29 మద్యం సీసాలు, బ్యాంకు ఖాతాలో రూ.3.83 లక్షల నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రాథమిక లెక్కల ప్రకారం సోదాల్లో రూ.5.32 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినప్పటికీ, మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు తేలడంతో భుజంగరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారగా, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణతో పాటు అక్రమాస్తుల కోణంలోనూ దర్యాప్తు మరింత వేగవంతమైంది.

Leave a Reply