నర్సింగ్ ఆఫీసర్ అనిత ఆత్మహత్యా

నర్సింగ్ ఆఫీసర్ అనిత ఆత్మహత్యా

భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇరుప అనిత(Irupa Anita) (30) ఆత్మహత్య చేసుకుంది.

భూపాలపల్లి ఇన్‌స్పెక్టర్ డి. నరేష్ కుమార్(Inspector D. Naresh Kumar) తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడు ఇరుప లక్ష్మయ్య రంగాపూర్ గ్రామం, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా.. తన కూతురు ఇరుప అనిత గత ఒక సంవత్సరం నుంచి (జిజిహెచ్) భూపాలపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్ గా పనిచేస్తోంది. ఇటీవలి కాలంలో ఆమె ఆరోగ్యం సహకరించడం లేదని ఈ క్రమంలో 3 నవంబర్ 2025 రాత్రి భూపాలపల్లిలోని మంజునగర్ ప్రాంతంలో తాను కిరాయికి ఉంటున్న తన నివాసంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి మరణానికి గల అసలు కారణాలు వెలికితీయడానికి పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ డి. నరేష్ కుమార్ తెలిపారు.