Peddi premiere show Report | పెద్ది ప్రీమియర్స్ ఫుల్ రివ్యూ…
Peddi premiere show Report | పెద్ది ప్రీమియర్స్ ఫుల్ రివ్యూ…
- ముగ్ధులను చేసిన రామ్ చరణ్..
- పెద్దితో మరో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్
- సెకండాఫ్‌లో బుచ్చిబాబు మ్యాజిక్!
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వచ్చిన మోస్ట్ అవేటెడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఆల్రెడీ పడిన ప్రీమియర్ షోస్ నుంచి అదిరిపోయే టాక్ బయటకు వచ్చింది. ఫస్ట్ షో అయిపోగానే సోషల్ మీడియాలో ఆడియన్స్, సినీ విశ్లేషకులు తమ రివ్యూస్ అండ్ ఒపీనియన్స్‌ను షేర్ చేసుకుంటున్నారు. ఓవరాల్‌గా ఇదొక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని, బుచ్చిబాబు పక్కాగా మ్యాజిక్ రీక్రియేట్ చేశాడని టాక్ వస్తోంది. సినిమా కంప్లీట్ రిపోర్ట్ అండ్ హైలైట్స్ మీకోసం..
ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే…
సినిమా ఫస్ట్ హాఫ్‌కు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కథను సెటప్ చేయడంలో దర్శకుడు సమయం తీసుకున్నప్పటికీ, పెద్ది క్యారెక్టర్ బ్యాక్‌డ్రాప్, అతడు ఎదుర్కొనే జీవిత పోరాటాన్ని బుచ్చిబాబు ఎమోషనల్‌గా ఎస్టాబ్లిష్ చేశారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్, రగ్గడ్ లుక్, క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఎపిసోడ్స్ ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సాగే సీక్వెన్స్ థియేటర్లలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోందట. ఇంటర్వెల్ బ్లాక్‌లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసినట్లు టాక్.
అయితే హీరోయిన్ జాన్వీ కపూర్‌తో నడిచే ప్రేమకథ ట్రాక్ పెద్దగా పండలేదని, రొమాంటిక్ ట్రాక్ కథకు పెద్దగా ప్లస్ కాలేదని, కథా ప్రవాహానికి అది అంతగా ఉపయోగపడలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే జగపతిబాబు పోషించిన అప్పలసూరి పాత్ర కొన్ని చోట్ల ఓవర్డ్రామాటిక్గా అనిపించిందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
సెకండాఫ్‌లో అసలు మ్యాజిక్!
ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ పూర్తిగా వేరే లెవెల్లో ఉందని ప్రీమియర్ షో చూసిన వారు చెబుతున్నారు. స్పోర్ట్స్ డ్రామాను ఒక సోషల్ కాజ్‌తో ముడిపెట్టి దర్శకుడు బుచ్చిబాబు డిజైన్ చేసిన విధానం సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌గా నిలిచిందని అంటున్నారు. ఎమోషనల్ హై పాయింట్స్, మ్యాచ్ సీక్వెన్స్‌లు, క్యారెక్టర్స్ జర్నీ, క్లైమాక్స్ ఎగ్జిక్యూషన్ ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేస్తున్నాయట. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించే స్థాయిలో ఉండగా, రామ్ చరణ్ తన కెరీర్లోనే అత్యంత ఎమోషనల్ & మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే ప్రశంసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎలా ఉంది?
సినిమాకు మరో ప్రధాన బలంగా ఏఆర్ రెహమాన్ సంగీతం నిలిచిందని ప్రీమియర్ షో ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసిందని ప్రశంసలు వినిపిస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో వచ్చే థీమ్ మ్యూజిక్, భావోద్వేగ సన్నివేశాల్లో రెహమాన్ ఇచ్చిన స్కోర్ కథలోని భావాలను ప్రేక్షకులకు మరింత బలంగా కనెక్ట్ చేస్తోందట.
ఇప్పటికే విడుదలైన ‘రాయ్ రాయ్ రారా’, ‘చికిరి చికిరి’ పాటలు థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకుంటుండగా, సినిమాలో వాటి ప్లేస్మెంట్ కూడా బాగుందని అంటున్నారు. రెహమాన్ మార్క్ మెలోడీ, ఎమోషనల్ స్కోర్ ‘పెద్ది’కి అదనపు బలంగా మారిందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
బుచ్చిబాబు మరోసారి ప్రూవ్ చేశారా?
‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న ఈ సినిమా కథలో ఎమోషన్స్, స్పోర్ట్స్, మాస్ మూమెంట్స్, సోషల్ మెసేజ్‌లను బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని తొలి స్పందనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ రైటింగ్, ఎమోషనల్ పే-ఆఫ్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని అంటున్నారు ప్రీమియర్ ప్రేక్షకులు.
ఓవరాల్‌గా…
ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా, యావరేజ్‌గా అనిపించినా.. సెకండాఫ్‌లో సినిమా బలంగా పుంజుకుని ప్రేక్షకులకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అందిస్తోందనే ప్రేక్షకులు, అభిమానుల నుంచి టాక్ వినిపిస్తోంది. ఎమోషన్స్, క్రికెట్, సామాజిక సందేశం కలయికతో రూపొందిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద పెద్ద విన్నర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రీమియర్ షో టాక్..
🔹 ఫస్ట్ హాఫ్ – డీసెంట్, ఎమోషనల్ సెటప్
🔹 ఇంటర్వెల్ బ్లాక్ – మేజర్ హైలైట్
🔹 రామ్ చరణ్ – కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటూ ప్రశంసలు
🔹 ఏఆర్ రెహమాన్ BGM – సినిమాకు అదనపు బలం
🔹 ‘రాయ్ రాయ్ రారా’, ‘చికిరి చికిరి’ పాటలకు మంచి రెస్పాన్స్
🔹 సెకండాఫ్ – ఎమోషనల్ & పవర్ఫుల్
🔹 స్పోర్ట్స్ + సోషల్ కాజ్ మిక్స్ – బిగ్గెస్ట్ ప్లస్
🔹 క్లైమాక్స్ – హార్ట్ టచింగ్
🔹 ఓవరాల్ – స్ట్రాంగ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్
