కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించిన మండల అధ్యక్షుడు భాస్కర్
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ జెండా ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బోనగిరి భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, సోనియా గాంధీ పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మురళి, తక్కురి దేవేందర్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, కిసాన్ ఖేత్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, అల్లాకొండ రాజేష్, మండల జనరల్ సెక్రటరీ తక్కురి రాజశేఖర్, గోపిడి లింగారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ సాల్లూరి గణేష్, చౌటుపల్లి టౌన్ ప్రెసిడెంట్ రవీందర్ పాల్గొన్నారు.
అలాగే శివసరం గణేష్, మండల యూత్ ఉపాధ్యక్షులు కౌడ శైలేందర్, వేములవాడ జగదీష్, నిమ్మ రాజేంద్రప్రసాద్, బుచ్చి మల్లయ్య, శివసరం నరేష్, అరవింద్, పూజారి శేఖర్, సింగిరెడ్డి శేఖర్, దిలీప్, వినీల్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
