Vision 2047 | సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం

Vision 2047 | సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం

రైతుల‌ను పారిశ్రామిక‌వేత్త‌లు, మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రులుగా చేస్తాం
రైతులు ఇత‌ర పంట‌ల‌పై దృష్టి పెట్టాలి
ఈ ఏడాది నుంచి వ‌రుస‌గా జాబ్ నోటిఫికేష‌న్లు ఇస్తాం
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు ప్రాణం పోస్తాం..
తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్​ నిర్మాణం కోసం చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం
ప‌రేడ్ గ్రౌండ్ లో ఘ‌నంగా తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు
రాష్ట్రం ప్ర‌జ‌ల‌కు సందేశ‌మిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Vision 2047 | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని తెలిపారు. తమది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజాప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణ విజన్-2047 లక్ష్యం సాధించే దిశగా తాము వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మంగ‌ళ‌వారం నాడు పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ, రైతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా తాము అడుగులు వేస్తున్నామని వెల్లడించారు.

Vision 2047 |
Vision 2047 |

Vision 2047 | అన్ని ర‌కాల పంట‌లు పండించాలి..

రైతులు అన్ని రకాల పంటలు పండించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పాలని రేవంత్​ అన్నారు. కొన్నిరకాల పంటలే కాదు కూరగాయలు కూడా పండించాలని రైతులకు సూచించారు. రైతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నమని తెలిపారు. రాష్ట్రంలో 2.36కోట్ల టన్నుల పంట దిగుబడులు రావడం తమకు గర్వకారణమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు అప్పు భారాన్ని తగ్గించేందుకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు సంక్షేమానికి రూ.1.56లక్షల కోట్లు కేటాయించామని చెప్పుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పంట కొనుగోళ్లపై రైతులకు రూ.82వేల కోట్లు కేటాయించామని చెప్పారు. రైతుల నుంచి 10వేల టన్నుల తడిసిన ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. జొన్న కొనుగోలుకు రూ.1,154కోట్లు చెల్లించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులను శ్రీమంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలను రుణాల నుంచి విముక్తి కల్పించామన్నారు.

Vision 2047 |

Vision 2047 | జ‌ల‌య‌జ్ఞం..

2004 లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం చేపట్టిన జలయఙ్ఞం ప్రాజెక్ట్​లు ఇంకా పెండింగ్​ లో ఉన్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలు అమలు చేశామన్న సీఎం .. రైతులకు అండగా ఉంటామన్నారు. రైతులకు అప్పుభారం తగ్గించేందుకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేశామన్నారు. తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని చోట్ల పోరాడుతామని ఆవిర్భావ వేడుకల్లో తెలిపారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు ప్రాణం పోస్తాం..

గత పదేళ్లలో సాగునీటి పరిస్థితి మారలేదన్నారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్​ పనులను తిరిగి ప్రారంభించామన్నారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్​ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామన్నారు. గత పదేళ్లలో తెలంగాణలో సాగునీటి పరిస్థితి మారలేదని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు తిరిగి ప్రాణం పోస్తామని చెప్పారు. తుమ్మడిహెట్టి నిర్మాణం కోసం మహారాష్ట్రకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో తాము ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు దేశానికి ఆదర్శంగా మారారని తెలిపారు. ఆడబిడ్డలను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రూ.లక్ష కోట్ల రుణాలిస్తామని చెప్పారు. ఇప్పటికే రూ.60వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందజేశామని వెల్లడించారు.

త్వ‌ర‌లో జాబ్ నోటిఫికేష‌న్స్ ..

నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్​ న్యూస్ ​ చెప్పారు. త్వరలో అన్నా రకాల జాబ్​ నోటిఫికేషన్లు విడుదలచేస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియ నిరంతరంగా ఉంటుందన్నారు. ఈ నెలలోనే ( 2026 జూన్​) టీజీపీఎస్​సీ నోటిఫికేషన్లు వస్తాయంటూ..ఇంజినీరింగ్‌, పీసీబీ, అటవీశాఖ, టౌన్‌ప్లానింగ్‌, విద్యాశాఖలో ఉద్యోగాలకు మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయన్నారు. అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇక ప్రతి నెలా రెండు మూడు నోటిఫికేషన్లు వస్తాయనంన సీఎం.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో 3వేల 800 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతి లభిందన్నారు. జూన్​ 2,3 తేదీల్లో ఫారెస్ట్​ డిపార్ట్​ మెంట్​, సివిల్​ ఇంజనీరింగ్​ పోస్టులు, విద్యుత్​ శాఖ, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈవో పోస్టుల భర్తీ, పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు, రోడ్లు భవనాల శాఖ కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం రేవంత్​ తెలిపారు. న్యాయపరమైన సమస్యలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా 67వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఈనెలలోనే టీజీపీఎస్సీ ద్వారా మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

సీఎం రేవంత్ కీలక కామెంట్స్
జూన్ 2న ఒక భావోద్వేగ సందర్భం
తెలంగాణ కల సాకారం చేసిన సోనియాకు కృతజ్ఞతలు
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నాం
ప్రజాపాలనను ఆదరించే జనం మాకు అండగా ఉంటున్నారు
వరుస ఎన్నికల్లో మాపై భాద్యత పెరిగింది
ఆత్మగౌరవం,స్వేచ్ఛ,సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నాం
నియంతృత్వాన్ని తెలంగాణ గడ్డ సహించదు
ప్రభుత్వం అంటే 4 కోట్ల ప్రజల భాగస్వామ్యం
ఆత్మగౌరవం,స్వేచ్ఛ,సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నాం
నియంతృత్వం,రాచరిక పోకడలను ప్రజలు ఓడించారు.
ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
హరిత తెలంగాణను ఆవిష్కరించడమే లక్ష్యం
వరి,మక్క,పత్తి సాగు గణనీయంగా పెరిగింది
తెలంగాణ రైతన్నను దేశంలో నంబర్ గా నిలబెడుతాం
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ టాప్
అభివృద్ది,సంక్షేమం రెండు కళ్లలా పనిచేస్తున్నాం
రైతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్దిదిద్దుతున్నాం
జొన్న కొనుగోలు రూ. 1154 కోట్లు చెల్లించాం
గత పదేళ్లలోనూ తెలంగాణలో సాగునీటి పరిస్థితి మారలేదు
తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని రంగాల్లో పోరాడుతున్నాం
ఇప్పటి వరకు సంక్షేమానికి రూ. 1. 56 లక్షల కోట్లు కేటాయించాం
ఎన్ని ఇబ్బందులున్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటాం
ఇప్పటి వరకు పంట కొనుగోళ్లపై రైతులకు రూ. 82 వేల కోట్లు చెల్లించాం
రైతుల నుంచి 10 వేల టన్నుల తడిసిన ధాన్యం కొనుగోలు చేశాం
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్కు తిరిగి ప్రాణం పోస్తాం
తుమ్మిడి హెట్టి నిర్మాణం కోసం మహారాష్ట్రకు విజ్ఞప్తి చేస్తున్నా
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా మారారు
ఆడబిడ్డలను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రూ. లక్ష కోట్ల రుణాలిస్తాం
ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందజేశాం
ఆడబిడ్డల సంక్షేమంతోనే మా పాలన మొదలైంది
మహిళలు ఆర్టీసీలో రూ. 10 వే లకోట్ల విలువైన ప్రయాణాలు సాగించారు
తెలంగాణ సాధన కోసం నిరుద్యోగ యువత పోరాటం చేసింది
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 20వేల400 కోట్లుకేటాయించాం
నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించాలనే లక్ష్యం

CLICK HERE TO READ MORE : Talasani Srinivas Yadav | సీఎంపై తలసాని ఫైర్.. “కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం ఎవరి తరం?”

CLICK HERE TO READ MORE