Makthal | దేశ‌ స్వాతంత్ర్య యోధుడు బిర్సా ముండా

Makthal | దేశ‌ స్వాతంత్ర్య యోధుడు బిర్సా ముండా

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను మక్తల్ లో ఎబివిపి (ABVP) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎబివిపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనజాతి గౌరవ దివస్ కార్యక్రమాలో భాగంగా మఖ్తల్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని ఆయ‌న‌ చిత్రపటానికి పూలమాల వేసి పూజ కార్యక్రమం చేసిన అనంతరం సెమినార్ ఆరంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ కుమార్ (Vinay Kumar) మాట్లాడుతూ.. ఆయన జీవితం, త్యాగం జల్–జంగల్–జమీన్ తత్వం గురించి మాట్లాడుతూ… భారత స్వతంత్ర సమరచరిత్రలో సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, వంటి మాహానీయుల కోవకు చెందిన ఆదివాసి వీరుడు భగవాన్ బీర్సా ముండా అని కొనియాడారు.

1875 నవంబర్ 15న జార్ఖండ్ లోని వులిహాటు గ్రామంలో జన్మించిన ఆయన కేవలం 25 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వారి వ్యతిరేక పోరాటంలో తుది శ్వాస విడిచారన్నారు. బ్రిటిష్ పాలకులు (British rulers) సైనిక దౌర్జన్యంతో తప్పుడు ప్రచారంతో గిరిజన సమాజాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించిన తరుణంలో యువకుడిగా బీర్సా ముండా ఈ దోపిడిని త్వరగా గ్రహించి మన దేవుడు ప్రకృతిలో ఉన్నాడు మన భూమి మన తల్లి దాన్ని ఎవరు దోచుకోలేరు అని ప్రచారం ప్రారంభించి గిరిజన హృదయాల్లో విప్లవాన్ని రగిలించారన్నారు.

ఆదివాసి హక్కుల కోసం విప్లవం చేయడం జరిగిందన్నారు. బిర్సా ముండా (Birsa Munda) కేవలం తిరుగుబాటుదారుడు కాదు ఒక సాంస్కృతిక పునరుద్జీవకారుడు, 1899 డిసెంబర్లో ఉల్గులను విప్లవం ప్రారంభించాడు దీనిలో వందలాది మంది గిరిజనులు వీరమరణం పొందారన్నారు. చివరికి బీర్సా పట్టుబడటంతో రాంచీ జైల్లో పెట్టారన్నారు. 1900 జూన్ 9వ తేదీన తన 25 ఏట జైల్లో అమరుడయ్యాడు బీర్సా ముండా జయంతి ప్రాముఖ్యతను గుర్తించిన భారత ప్రభుత్వం 2021 లో ఆయన జయంతిని జన జాతి గౌరవ దినోత్సవం గా ప్రకటించిందనీ ఆదివాసి ఆత్మగౌరవ పతాక బీర్సా ముండా స్ఫూర్తిని నేటి యువత అందిపుచ్చు కోవాలన్నారు..ఈ కార్యక్రమంలో ఎబివిపి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు ఇందు,ఉపాధ్యక్షులు విజయలక్ష్మీ, ఆనంద్, అనిల్, రమేష్, శ్రీధర్,అభి , మాయ , కళాశాల విదార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply