Trisha | త్రిష పోస్ట్ వెనుక అర్థం ఇదేనా?
Trisha | త్రిష పోస్ట్ వెనుక అర్థం ఇదేనా?
పర్సనల్ లైఫ్‌లోకి నో ఎంట్రీ..
Trisha | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం, నటుడు విజయ్‌తో హీరోయిన్ త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఇప్పటివరకు త్రిష నేరుగా స్పందించలేదు. అయితే తాజాగా ఆమె చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తన పెంపుడు కుక్క ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన త్రిష, దానికి ఆసక్తికరమైన క్యాప్షన్ జత చేశారు. “నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు దీనికి మాత్రమే అనుమతి ఉంది” అనే అర్థం వచ్చేలా ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
త్రిష చేసిన ఈ పోస్ట్‌ను నెటిజన్లు విజయ్‌తో రిలేషన్ రూమర్స్‌పై పరోక్ష కౌంటర్‌గా చూస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలు, ట్రోల్స్‌కు ఆమె స్టైలిష్‌గా సమాధానం ఇచ్చినట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
