వడదెబ్బతో వ్యక్తి మృతి..
శంకరపట్నం, ఆంధ్రప్రభ : వడదెబ్బ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా , మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మొలంగూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అమ్జద్ ఖాన్ (45) అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో రేకుల షెడ్డు నిర్మాణం పనులు చేస్తుండగా సొమ్మసిల్లి పడిపోగా, ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకువచ్చిన, అమ్జద్ ఖాన్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
