సీీపీఎం బెజ్జంకి శాఖ కార్యదర్శి బొమ్మిడి సాయి కృష్ణ ముందస్తు అరెస్ట్
బెజ్జంకి, ఆంధ్రప్రభ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసనకు బయలుదేరుతున్న అంగన్వాడీలను, సీపీఎం బెజ్జంకి గ్రామ కార్యదర్శి బొమ్మిడి సాయికృష్ణను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా బొమ్మిడి సాయి కృష్ణ మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీలకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 18వేలు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు. అంగన్వాడీ యూనియన్ నాయకులను, సీపీఎం పార్టీ నాయకులను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వానికి హెచ్చరించారు.
