అమరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛావాయువులు

అమరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛావాయువులు

  • నాటి అమరులను స్మరిస్తూ భవిష్యత్తు అభివృద్ధి పై దృష్టి సారి ఇద్దాం
  • రాష్ట్ర ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
  • తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
  • జాతీయ జెండా ఎగరవేసిన మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, ఆంధ్రప్రభ ; తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలిదశ మలిదశ ఉద్యమాల్లో ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగ ఫలితమే నేడు మనమంతా స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరులయ్యారని వారి త్యాగం వల్లే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని అన్నారు.నాటి అమరులను స్మరిస్తూ నేడు అభివృద్ధి సాధిద్దామని మంత్రి శ్రీహరి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడు జి .నీలప్ప ముదిరాజ్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించిన తెలంగాణ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి అమరుల చిత్రపటాలకు పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.అక్కడే ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారులు జి.నీలప్ప ముదిరాజ్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి జాతీయ జెండాను ఎగరవేశారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి చివరి వరకు మక్తల్లో ఉద్యమాన్ని నడిపించిన వారందరిని మంత్రి గుర్తు చేసుకుంటూ అమరులైన వారికి నివాళులర్పించారు. ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జి.నీలప్ప ముదిరాజ్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యాక కూడా ప్రతి ఏడాది జూన్ రెండుగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ అన్ని పార్టీల నాయకులను ఉద్యమకారులను సమీకరించి వేడుకలు జరపడం ఎంతో అభినందనీయమని అన్నారు.

మక్తల్ లో కొనసాగిన ఉద్యమాన్ని మంత్రి గుర్తు చేసుకుంటూ నాటి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి యువజన మహిళా ప్రజా సంఘాలతో పాటు అన్ని పార్టీల నాయకులను అభినందించారు .సుదీర్ఘ పోరాటం అమరుల త్యాగం వల్ల సిద్ధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని మంత్రి పిలుపునిచ్చారు .ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాడు సహకరించి అధికార ప్రతిపక్ష పార్టీల పార్లమెంటు సభ్యులకు నాయకులకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని మక్తల్ నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని అన్నారు.

అమరులను గుర్తుంచుకుంటేనే మనుగడ సాధ్యమని అన్నారు .మక్తల్లో తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఆవిర్భాగ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న జి.నీలప్ప ముదిరాజ్ ను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మరోసారి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి ,మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హన్మంతు,మాజీ జెడ్పిటిసి జి .లక్ష్మారెడ్డి మిజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి.రవికుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కె. ఆంజనేయులు గౌడ్ ,బి.గణేష్ కుమార్, బోయ రవికుమార్ ,బిజెపి నాయకులు చీరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.