ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు కావాలి
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలని మల్లేపల్లి సర్పంచ్ సత్యారాంకథలప్ప అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను తెలుసుకుని వాటిని ప్రణాళికబద్ధంగా గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈనెల 6న ప్రారంభమై జూన్ 2న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముగుస్తుందనిఅన్నారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
పార్టీలకతీతంగా ముందుకు వచ్చి మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వ నిధులు మంజూరు చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు పంచాయతీ కార్యదర్శి సుమన్ రెడ్డి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
