2nd Juneeditorial | కాశ్మీర్లో మే నెలలో ఉగ్రవాద మరణాలు శూన్యం
2nd Juneeditorial | కాశ్మీర్లో మే నెలలో ఉగ్రవాద మరణాలు శూన్యం
2nd Juneeditorial | పహల్గావ్ ఘటన తర్వాత భద్రత కట్టుదిట్టం
అమర్నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు
2nd Juneeditorial | కాశ్మీర్లో మే నెలలో ఉగ్రవాద సంబంధిత మరణం ఒక్కటి కూడా నమోదు కాలేదని దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్ స్పష్టం చేసింది. ఇది చాలా చెప్పుకోదగిన విషయంగా ఆ పోర్టల్ పేర్కొంది. కాశ్మీర్లో పర్యాటకులపైనే కాకుండా, స్థానికులపై కూడా దాడులు జరగడం సర్వసాధారణమైన పరిస్థితుల్లో ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం ముమ్మాటికీ విశేషమే.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో తిష్టవేసి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. బయటి వారన్న అనుమానం వస్తే, పేర్లు అడిగి మరీ కాల్పులు జరుపుతున్నారు. పహల్గావ్లో 26 మంది పర్యాటకులను కాల్చిచంపిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారేనని రూఢి అయింది. ఈ కుట్రను అమలు చేసిన సులెమన్ షా, హబీబ్ తహీర్, హంజా అఫ్గానీలు మన భద్రతాదళాల ఎదురు కాల్పుల్లో మరణించారు. వీరు పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-ఎ-తోయిబా సంస్థకు చెందినవారు.
ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆ తర్వాత కూడా కాశ్మీర్‌లోని రాజోరీ తదితర ప్రాంతాల్లోకి చొరబడి ఉగ్రవాద కార్యకలాపాలను సాగిస్తూనే ఉన్నారు. వీరిని ఎదుర్కోవడానికి కౌంటర్ టెర్రరిజం దళాలు తరచూ ఎదురు కాల్పులు జరుపుతున్నాయి. మే నెలలో మాత్రం ఉగ్రవాద సంబంధిత మరణాలు అసలు లేవని దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్ పేర్కొంది. అంతేకాక, ఈ మధ్య యాత్రికుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాశ్మీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న సంగతి తెలిసిందే.
జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన నివేదికల ప్రకారం, ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో ఉగ్రవాద సంబంధిత మరణాలు 12 మాత్రమే చోటుచేసుకున్నాయి. ఈ 12 మందిలో పది మంది ఉగ్రవాదులు, ఒక జవాన్ ఉన్నారు. సామాన్యులెవరూ ప్రాణాలు కోల్పోలేదు. కాశ్మీర్లో అత్యధికంగా 2001లో 300 మందికి పైగా ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారు. గత ఏడాది 43 మంది మాత్రమే ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో మరణించారు.

పహల్గావ్ ఘటన తర్వాత కాశ్మీర్లో శాంతిభద్రతల యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాద సంస్థల నెట్‌వర్క్‌లను ఛేదిస్తున్నారు. కాశ్మీర్లో పరిస్థితిపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ప్రపంచ దేశాల నాయకులు ఆరా తీస్తున్నారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
కాశ్మీర్లో పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ‘మన్ కీ బాత్’లో కూడా ప్రస్తావించారు. కాశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కాశ్మీర్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగినట్లు ఇటీవల అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభమై ఆగస్టు 28వ తేదీన ముగుస్తుంది. అయితే, అక్కడి వాతావరణం ఇంకా అనుకూలంగా లేదన్న వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదుల దాడుల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
