ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్‌కు విశేష స్పందన

ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్‌కు విశేష స్పందన
తొమ్మిదో రోజు వినతులు స్వీకరణ కొనసాగింపు
భవానీపురం, ఆంధ్రప్రభ: ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ తొమ్మిదో రోజుకూడా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓపికగా విని, సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి, తక్షణ పరిష్కారం దిశగా సమన్వయ చర్యలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను తెలుసుకుని మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి నిరంతరం ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేత బంకా నాగమణి, కూటమి నేతలు కామదేవ రాజ్, సయ్యద్ కరిముల్లా, నాగోతి రామారావు, బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఏలూరు సాయి శరత్, గన్నవరపు శ్రీనివాసరావు, పగడాల కృష్ణ, దేవిన హరి ప్రసాద్, బొబ్బిలి లీలా కుమార్ తదితరులు పాల్గొన్నారు.
