ఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు సిర్పూర్( యు )ఎస్సై విక్రం, ఎ ఎస్సై పోలీసులు సిర్పూర్ (యు) మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తొడసం ధర్మారావు, సహకార చైర్మన్ శివాజీ, సిర్పూర్ (యు) పంచాయతీ సర్పంచ్ ఆత్రం ఓం ప్రకాష్, బాండేర్ సర్పంచ్ కుమ్ర భీమ్రావు, బి ఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అరెస్ట్ అయిన వారిని సొంత పూచికతపై రాయించుకుని పంపించారు.

Leave a Reply