Bus Smoke | బస్సులో పొగలు.. సురక్షితంగా బయటపడ్డ ఆటగాళ్లు

Bus Smoke | బస్సులో పొగలు.. సురక్షితంగా బయటపడ్డ ఆటగాళ్లు

Bus Smoke | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో సాంకేతిక సమస్య తలెత్తడంతో కాసేపు ఆందోళన నెలకొంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా బస్సులో పొగలు వ్యాపించడంతో వాహనాన్ని మార్గమధ్యంలో నిలిపివేశారు.

ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు సభ్యులు హోటల్‌కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణ మధ్యలో బస్సులో ఒక్కసారిగా పొగలు కనిపించడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. అనంతరం ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్‌ను సురక్షితంగా బయటకు దించారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. అందరూ క్షేమంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేసే వరకు ఆటగాళ్లు, సిబ్బంది రోడ్డుపైనే కొంతసేపు వేచి చూసినట్లు తెలుస్తోంది. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

Leave a Reply