13 days | జెనిటిక‌ల్ రీ ప్రోగ్రామింగ్‌తో సాధ్య‌మే

13 days | జెనిటిక‌ల్ రీ ప్రోగ్రామింగ్‌తో సాధ్య‌మే

13 days |
13 days |

53 ఏళ్ల మ‌హిళ క‌ణాల‌ను 23ఏళ్ల‌కు తీసుకొచ్చిన శాస్త్రవేత్త‌లు
2020లోనే మొద‌లైన యాంటీ ఏజింగ్ రీసెర్చ్‌
నానో క్యారియ‌ర్ల స‌హాయంతో చ‌ర్మ క‌ణాల‌పై ప్ర‌యోగాలు
వృద్ధాప్యాన్ని జ‌యించే దిశ‌గా తొలి ప్ర‌యోగం స‌క్సెస్‌
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొత్త చ‌ర్మ‌క‌ణాల రీసెట్‌
చ‌ర్మ క‌ణాల‌ను రీసెట్ చేసే సెనోలిటిక్స్‌పై మ‌రిన్ని ప్ర‌యోగాలు
మెడిక‌ల్ హిస్ట‌రీలో మైలురాయిగా నిలుస్తుంద‌న్న‌ వైద్య నిపుణులు

13 days | సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : వృద్ధాప్యాన్ని జయించే దిశగా తొలి అడుగుప‌డింది. మెడికల్ హిస్టరీలోనే ఇది ఒక మైలురాయిగా మారబోతోంది. ఈ ట్రీట్‌మెంట్‌లో చర్మ కణాలు వాటి అసలు రూపాన్ని కోల్పోకుండా, కేవలం వాటి వయస్సును మాత్రమే రీసెట్ చేస్తున్నారు. 13 రోజుల పాటు సెల్స్‌కు కెమికల్స్‌ను అందించారు. అంటే పార్షియల్ సెల్యులార్ రీప్రోగ్రామింగ్ చేశారు. ఈ ప్రయోగం తర్వాత ఆ కణాలు 23 ఏళ్ల యువతి కణాల వలె పనిచేయడం స్టార్ట్ చేశాయి. యవ్వనంలో ఉన్నట్లే చర్మాన్ని మెరిపించే కొల్లాజెన్‌ను విపరీతంగా ఉత్పత్తి చేశాయి. అంతేకాకుండా చర్మంపై అయిన గాయాలను కూడా వేగంగా నయం చేశాయి. అయితే ఇదంతా టెంపరరీ కావ‌చ్చ‌ని తొలుత సైంటిస్టులు భావించారు. కానీ, కొన్ని వారాల తర్వాత చూసినా ఆ కణాలు యంగ్ గానే బిహేవ్ చేశాయి. అంటే ఇది ఒక రకమైన బయోలాజికల్ రీసెట్ అన్న‌ది తేలిపోయింది. ముఖానికి వేసుకునే క్రీములు, ఇంజెక్షన్ల లాంటి తాత్కాలిక సొల్యూషన్ కాద‌ని స్ప‌ష్టం అవుతోంది.

13 days |
13 days |

13 days | 2022లో ల్యాబ్‌ టెస్ట్‌లో..

రోజు రోజుకూ మన వయసు పెరుగుతుంది.. కానీ.. అందం తరిగే అవకాశాలు మాత్రం చాలా తక్కువ అయిపోతాయని తెలుస్తోంది. అయితే ఇదేదీ అంత ఫాస్ట్‌గా అయ్యే పని కాదు. 2022లో ల్యాబ్‌ టెస్ట్‌లో ఒక స్టెప్‌ పడగా.. సెకండ్ స్టెప్‌లోకి రావడానికి నాలుగేళ్లు పట్టింది. మరికొన్ని సంవత్సరాల పాటు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉంది. సైంటిస్టులు కేవలం చర్మానికే పరిమితం కాకుండా.. ఈ పార్షియల్ రీప్రోగ్రామింగ్ విధానాన్ని కాలేయం, క్లోమం, రక్తంపై టెస్ట్ చేశారు. ఈ పద్ధతి ద్వారా వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, కంటి శుక్లాలు, గుండె జబ్బులకు కారణమయ్యే అంతర్గత కణాల డీఎన్ఏ మార్కర్లను కూడా సక్సెస్‌ఫుల్‌గా యంగ్‌గా మార్చేయవచ్చని తెలుస్తోంది.

13 days | క్లినికల్ ట్రయల్స్..

ఈ ప్రయోగంలో వాడే యామనాక ఫ్యాక్టర్స్ వల్ల కణాలు ట్యూమర్లుగా మారే ప్రమాదం ఉండేది. కానీ రీసెంట్ టెస్ట్‌లో అలా జరగలేదు. కేవలం 13 రోజుల పాటు మాత్రమే కెమికల్స్ ఇవ్వడంతో.. కణాల ఐడెంటిటీ మారలేదు.. కేన్సర్‌ ముప్పు కూడా రాలేదని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ఈ యాంటీ-ఏజింగ్ టెక్నాలజీని ల్యాబ్ నుండి క్లినికల్ ట్రయల్స్ వైపు తీసుకువెళ్లడానికి బిలియన్ల డాలర్ల బడ్జెట్‌ను ఉపయోగిస్తున్నారు. త్వ‌ర‌లోనే నార్మల్‌గా యూజ్‌ చేసే క్రీమ్‌ మాదిరిగా మార్కెట్‌లో దొరికే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు.. గతంలో కూడా యాంటీ ఏజింగ్‌పై అనేక రకాల టెస్ట్‌లు జరిగాయి. సెల్యులార్ సెనెసెన్స్ అంటే.. వయసు పెరిగే కొద్దీ కొన్ని కణాలు విభజన చెందడం ఆగిపోతాయి. కానీ అవి చనిపోవు. వీటిని జాంబీ సెల్స్‌ అంటారు. ఇవి శరీరంలో మంటను కలిగిస్తాయి. ఈ కణాలను నాశనం చేసే సెనోలిటిక్స్ అనే మందులపై శాస్త్రవేత్త‌లు పరిశోధనలు చేస్తున్నారు.

CLICK HERE TO READ MORE : Sugar Detox | కేవలం 30 రోజులు చక్కెర మానేస్తే మీ రూపమే మారిపోతుంది!

CLICK HERE TO READ MORE :

Leave a Reply