పంచాయతీలో మౌలిక వసతులు

పంచాయతీలో మౌలిక వసతులు

డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

జైనూర్ – ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గూడ మామడ పంచాయతీలో హనుమాన్ గూడ ప్రాంతంలో డ్రైనేజీ నిర్మాణానికి ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా నిధులు మంజూరు కావడంతో ఆదివారం నిర్మాణ పనులను ప్రారంభించారు.

గూడ మామడ సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు, ఉప సర్పంచ్ కరాలే శివాజీ భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మురికి కాలువ నిర్మాణంలో నాణ్యతకు ఎలాంటి భంగం కలగకుండా అధికారులు, కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పంచాయతీలో మౌలిక వసతుల కల్పన, గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కేశవరావు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.